Breaking News

వరంగల్ మున్సిపల్ బరిలో ప్రధాన పార్టీలు..


Published on: 04 Feb 2026 12:06  IST

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి నుంచి జోరుగా కొనసాగనుంది.గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగుతుండటంతో ప్రచారం రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ తమ అభ్యర్థుల విజయానికి వ్యూహాలు రచిస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, సభలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారి మున్సిపల్ బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒంటరిగానే పోటీకి దిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి