Breaking News

ఘాటెక్కిన మిర్చి ధర..


Published on: 06 Feb 2026 17:48  IST

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది. ఏనుమాముల మార్కెట్‌కు మిర్చి రాబడులు గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కాగా, బుధవారం వండర్‌హాట్‌ మిర్చి రూ.37,100 ధర పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.900 పెరిగి రూ.38వేలు పలకడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి