Breaking News

నష్టం వస్తే భయపడుతున్నారా?


Published on: 06 Feb 2026 18:36  IST

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు మన లాభనష్టాలను నిర్ణయించేది కేవలం మార్కెట్‌ తీరుతెన్నులే కాదు.. మన మనస్తత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం సూత్రాల ప్రకారం.. పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశం ‘భావోద్వేగం’. సాధారణంగా మనకు ఒక నిర్ణీత మొత్తంలో లాభం వస్తే కలిగే సంతోషం కంటే, అంతే మొత్తం నష్టపోతే కలిగే బాధ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. ఇది వాస్తవ పరిస్థితుల కంటే, ఊహాజనిత నష్టానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా చేస్తుంది. 

Follow us on , &

ఇవీ చదవండి