Breaking News

విదేశాలకు తెలంగాణ చేప..


Published on: 13 Nov 2025 17:04  IST

దేశంలో పెరుగుతున్న మంచినీటి చేపల ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఒక అత్యాధునిక అంతర్జాతీయ ఇన్లాండ్ ఫిషరీస్ ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఏకంగా రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థతో డీపీఆర్ సిద్ధం చేయించి, ఇటీవలే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement