Breaking News

కూతుర్ని అమ్మేసిన తండ్రి..


Published on: 18 Nov 2025 15:30  IST

కన్న బిడ్డను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు. మైనర్ కూతుర్ని 20 లక్షల రూపాయలకు అమ్మేశాడు. కూతురికంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. చివరకు పాపం పండి ఆ కన్నతండ్రి, పెళ్లికొడుకు జైలు పాలయ్యారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు బాలిక తండ్రి, భర్తపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి