Breaking News

ఏ తప్పూ చేయలేదు.. లైడిటెక్టర్‌‌ టెస్ట్‌కి రెడీ


Published on: 21 Nov 2025 15:24  IST

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి