Breaking News

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెర


Published on: 25 Nov 2025 14:13  IST

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ(మంగళవారం) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సాయంత్రం 6:15 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే రూరల్‌లోని 545 మండలాలు, 12733 గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి