Breaking News

ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి..హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌


Published on: 25 Nov 2025 14:17  IST

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన వాట్సాప్‌ నంబరు అంటూ నకిలీ నెంబరు తో గుర్తుతెలియని వ్యక్తులు చాట్‌ చేస్తున్నారని రకుల్ తెలిపింది. ఆ నెంబర్ తో వచ్చే మెసేజులకు స్పందించవద్దంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. ‘అందరికీ హాయ్... ఎవరో వాట్సాప్‌లో నా పేరుతో చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఆ నెంబర్ నాది కాదని గమనించండి . వారితో మాట్లాడకండి. వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేయండి’ అంటూ ఈ ట్వీట్‌ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి