Breaking News

అర్ష్‌దీప్ సింగ్ విజృంభణ..


Published on: 03 Jan 2026 15:54  IST

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్‌ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో పంజాబ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో సిక్కిం తొలుత బ్యాటింగ్‌కి దిగింంది. పంజాబ్‌ తరఫున బరిలోకి దిగిన టీమిండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ విజృంభించడంతో సిక్కిం జట్టు విలవిల్లాడింది. కేవలం 22.2 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. అర్ష్‌దీప్ బౌలింగ్ ధాటికి ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 75 పరుగులకే సిక్కిం ఆలౌటైంది.

Follow us on , &

ఇవీ చదవండి