Breaking News

మరో 26 మంది మావోయిస్టుల సరెండర్


Published on: 07 Jan 2026 18:09  IST

ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం మరికొంత మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో సీనియర్ పోలీసు అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు 26 మంది లొంగిపోయారు. వీరిలో 13 మందిపై మొత్తం రూ. 65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. పోరుబాట వీడిన వారి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పూనా మార్గెమ్ కార్యక్రమంలో భాగంగా నక్సల్స్ లొంగిపోయినట్టు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి