Breaking News

పెట్రోల్ పోసుకొని ప్రియుడు ఆత్మహత్య


Published on: 07 Jan 2026 18:13  IST

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో పూజ అనే 17 ఏళ్ల యువతి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణం అదే గ్రామానికి చెందిన సిద్దగోని మహేష్ అని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ మహేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి