Breaking News

నేడు దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ


Published on: 20 Jan 2026 12:13  IST

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ వేదికగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఐబీఎం, గూగుల్‌ క్లౌడ్‌ వంటి సంస్థలతో ముఖాముఖీ భేటీలను నిర్వహించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక సాంకేతికత, ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ వంటి అంశాలపై సీఎం దృష్టి సారించనున్నారు. ఉదయం సీఐఐ బ్రేక్‌ఫాస్ట్‌ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్‌ అడ్వాంటేజ్‌’ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి