Breaking News

హైదరాబాద్‌ సమీపంలో పెద్దపులి సంచారం


Published on: 21 Jan 2026 14:19  IST

హైదరాబాద్‌ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రాజధానికి 60 కి.మీ దూరంలో యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం పెద్దపులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఇంకా అక్కడే సంచరిస్తున్నట్లుగా కొత్తగా పాదముద్రలు కనుగొనడం ద్వారా నిర్ధారించారు. హైదరాబాద్‌కు ఇంత సమీపంలో పెద్దపులి జాడలు కనిపించడం 50 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి