Breaking News

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’..


Published on: 21 Jan 2026 15:40  IST

లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నో వర్క్.. నో పే’ అనే విధానం చట్టసభల్లోనూ రావాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని.. దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే.. సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపి వేస్తున్నారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి