Breaking News

బొబ్బిలి సమీపంలో గజరాజుల స్వైరవిహారం


Published on: 27 Jan 2026 12:24  IST

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. దిబ్బగుడ్డివలస, రాజుపేట, సీతయ్యపేట గ్రామాల పరిధిలో సంచరిస్తున్నాయి. పిల్ల ఏనుగులతో కలిపి 8 ఏనుగులు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం, మక్కువ మండలాల సరిహద్దు నుంచి బొబ్బిలి పట్టణ సమీపానికి వచ్చేశాయి. మూడు రోజులుగా మొక్కజొన్న పంటను, రైతులు కళ్లాల్లో నిల్వచేసిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి