Breaking News

పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక


Published on: 27 Jan 2026 14:36  IST

మూడు రోజుల పాటు జరిగిన పీడీఎ్‌సయూ రాష్ట్ర 23వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఎన్నికైన రాష్ట్ర నూతన కమిటీ వివరాలను కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా కాంపాటి పృథ్వీ, ఎస్‌. అనిల్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యాక్షులుగా బి.నర్సింహారావు, ఎం.నరేందర్‌, ఎస్‌.రాకేశ్‌, సహాయ కార్యదర్శులుగా వంగూరి వెంకటేశ్‌, సురేశ్‌, గణేశ్‌, బోయినపల్లి అజయ్‌, కోశాధికారిగా అంగిడి కుమార్‌ ఎన్నికయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి