Breaking News

తిరుమలలో రథసప్తమి రికార్డ్‌


Published on: 28 Jan 2026 11:42  IST

ఎన్నడూలేని విధంగా ఈసారి రథసప్తమి రోజున తిరుమల మాడవీధుల్లో వాహనసేవలను రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వీక్షించారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రథసప్తమి నిర్వహణపై మంగళవారం మధ్యాహ్నం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో అన్ని విభాగాల సమన్వయంతో సఫలీకృతమయ్యామని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి