Breaking News

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..


Published on: 29 Jan 2026 15:47  IST

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారు. 

Follow us on , &

ఇవీ చదవండి