Breaking News

కాకినాడలో విషాదం.. ఆటో బోల్తా పడి చిన్నారి మృతి


Published on: 29 Jan 2026 15:49  IST

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో.. రాయుడుపాలెం సెంటర్ వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వార్త విన్న చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి