Breaking News

పంజాబ్‌లో నేల కూలిన గుర్తు తెలియని విమానం


Published on: 07 May 2025 15:00  IST

పంజాబ్‌లోని బతిండాలోని అక్లియన్ ఖుర్ద్ గ్రామంలో తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని విమానం కూలిపోయింది. జనావాసాలకు 500 మీటర్ల దూరంలో గోధుమ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారని, 9 మంది గాయపడ్డారాని సమాచారం. కాగా నేల కూలిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి