Breaking News

దేశవ్యాప్తంగా ప్రారంభమైన మాక్‌ డ్రిల్స్‌


Published on: 07 May 2025 16:48  IST

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. మరోపక్క.. ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ మెరుపు దాడులతో గట్టి సమాధానం ఇచ్చింది. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ తామూ దాడులు చేస్తామని ప్రేలాపనలు పేలుతోంది. ఈ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం నాలుగు గంటలకు మాక్‌ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి