Breaking News

Odisha Car Trip: కారులో ఒడిశాకు వెళ్లి చూడండి.. మీ ప్రయాణం మరో లెవెల్లో ఉంటుంది.. !

కారులో ప్రయాణించడానికి (Car Travelling) మించిన సంతోషం ఉండదు. మరీ ముఖ్యంగా ప్రకృతితో మమేకమయ్యే ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం.


Published on: 07 Mar 2023 17:34  IST

ఏదైనా కొత్త ప్రదేశాన్ని అన్వేషించాలంటే కారు ప్రయాణం ఉత్తమ మార్గం. రహదారిపై అలా దూసుకెళుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కారులో తిరగడం (Car Travelling) మాటల్లో వర్ణించలేని సంతోషాన్ని అందిస్తుంది. అలాంటి ప్రయాణాన్ని ఆస్వాదించాలనే కోరిక ఉంటే వెంటనే ఎవరైనా ఒకసారి ఒడిశా రాష్ట్రాన్ని (Odisha Tourist Spots) సందర్శించండి. కారులో ప్రయాణిస్తూ అక్కడి పర్యాటక అందాలను వీక్షిస్తూ ప్రకృతితో మమేకవ్వడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అక్కడి రహదారులు విభిన్న గమ్యస్థానాలకు విస్తరించి ఉండటంతో ప్రయాణికులు బీచ్‌లు, అడవులు, హిల్ స్టేషన్‌లు, గిరిజన గ్రామాలు, జలాశయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి సుందరమైన, అందమైన, ఆహ్లాదకరమైన, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలను చూస్తారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మడ అడవుల్లోకి లోతుగా.

ఒడిశాలోని సహజసిద్ధమైన సౌందర్యాన్ని ఆవిష్కరించే మడ అడవులను చూడాలంటే మీరు కోల్‌కతా నుండి బిచిత్రాపూర్, చండీపూర్‌ మీదుగా భితార్కనికా వరకు ప్రయాణించి చూడండి. అలాగే అక్కడి పరిసరాల్లోని అందాలను ఆస్వాదించడానికి పడవ ప్రయాణం చేయండి. దాంతో మీరు ప్రకృతితో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉంటుంది. ఆ మార్గంలో చందనేశ్వర్ ఆలయం, బాలాసోర్‌లోని ఇమామి జగన్నాథ దేవాలయం వంటి చారిత్రాత్మక దేవాలయాలను కూడా చూడొచ్చు. చాందీపూర్ బీచ్‌లోని మనోహరమైన 'రిసిడింగ్ బీచ్' దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. భితార్కనికా నేషనల్ పార్క్‌ను చుట్టేయొచ్చు. అలా ఈ ప్రయాణం గొప్పగా ఉంటుంది.

టైగర్ ట్రయల్స్, రాయల్టీ.

వన్యప్రాణి ప్రేమికులు, చరిత్రకారులు రెండు రకాల ప్రయాణికులు ఆస్వాదించే ఈ ప్రయాణం ఎంతో ఉద్వేగంగా ఉంటుంది. జంషెడ్‌పూర్ నుండి సిమిలిపాల్ వరకు ప్రయాణించి చూస్తే.. బరేహిపాని, దేవ్‌కుండ్, జోరాండా జలపాతాలను చూడొచ్చు. అలాగే చహలా వద్ద నెమళ్ల అందాలను ఆస్వాదించొచ్చు. ఇక సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్‌లో జంగిల్ సఫారీ చేయొచ్చు. చరిత్రకారులు కృష్ణ మోహన్ హనుమాన గుహ దేవాలయాన్ని సందర్శించొచ్చు, అథరా దేవుల ఆలయ సముదాయం, ఖిచింగ్ కీచకేశ్వరి ఆలయం వంటివి చూడొచ్చు. అలగే చారిత్రక రాయల్టీ గురించి విశాలమైన బెల్గాడియా ప్యాలెస్‌ను చుట్టి రావచ్చు.

ఒడిశా వైల్డ్ వెస్ట్ కోసం అన్వేషణ.

ఒడిశా వైల్డ్ లైఫ్‌ని ఆస్వాదించాలంటే రాయ్‌పూర్ నుండి హిరాకుడ్ మీదుగా దేబ్రిగర్ ప్రయాణించి చూడండి. అక్కడి పరిసరాలు ఉల్లాసకరమైనవే కాకుండా సాహసోపేతంగా ఉంటాయి. డేబ్రిగర్, సత్కోసియా వన్యప్రాణుల అభయారణ్యంలో అడ్రినలిన్‌తో నిండిన జంగిల్ సఫారీలను ఎంజాయ్ చేసి చూడండి. అలాగే గంధమర్దన్ కొండల మధ్య సుందరమైన ట్రెకింగ్ మార్గాల్లో ప్రయాణించి చూడండి. అలాగే మీకు వీలున్నప్పుడు అక్కడి విలాసవంతమైన హోటళ్లలో బసచేసి చూడండి. నిశ్శబ్ద ప్రకృతి శిబిరాలు, ఖరీదైన గుడారాలు ఈ ప్రయాణాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తాయి.

చిలికా సరస్సు‌లో బోట్ ప్రయాణం.

ఒడిశాకు సంబంధించిన అసలైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించాలంటే చిలికా సరస్సులో బోటింగ్ చేసి చూడండి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే ఈ సరస్సు మీకు అంతులేని మధురానుభూతుల్ని పంచుతుంది. విశాఖపట్న నుండి గోపాల్‌పూర్ మీదుగా చిలికా వరకు ప్రయాణించి చూడండి. ఆ జర్నీ మిమ్మల్ని గండహతి జలపాతం, తప్తపని వేడి నీటి బుగ్గల ప్రదేశం నుండి జిరాంగ్ మొనాస్టరీ వరకు తీసుకెళుతుంది. అలాగే ఇక్కడ చిలికా సరస్సులోని అందాలను ఆస్వాదించడం మర్చిపోవద్దు. అక్కడ వలస పక్షులతో పాటు సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు అలరిస్తాయి. ఇక సాహస ప్రియులు వీలైతే కుంతీ, భీముడు, జగన్నాథ ఆలయాలను సందర్శించండి.

మాన్సూన్ టూర్, అసలైన అందాలు.

ఒడిశాలోని సహజసిద్ధమైన అందాలు చూడాలంటే ఎవరైనా వర్షాకాలంలో విహరించి చూడాలి. అప్పుడు అక్కడి పరిసరాలన్నీ జీవం పోసుకున్నట్టుగా కనిపిస్తాయి. ఆ సమయంలో ఒడిశాలోని డియోమాలి హిల్స్‌లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లండి. అలాగే గుల్మి, డుడుమ జలపాతాలకు ట్రెక్కింగ్ చేయండి. పవిత్ర గుప్తేశ్వర్ గుహలో మీ నివాళులు అర్పించండి. సంస్కృతి, సంప్రదాయాల కోసం ధురుబా, గదబా గిరిజన గ్రామాలను సందర్శించండి. దీంతో వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఒడిశా వస్త్ర చరిత్ర గురించి తెలుసుకోవడానికి కోరాపుట్, కోట్‌పాడ్ గ్రామాలను సందర్శించండి.

కొండల్లో విహరించడం.

మీకు సాహసయాత్రలంటే ఇష్టమైతే ఈ దారిలో ప్రయాణించి చూడండి. చటికోనలోని పచ్చని కొండలు, లోయలు, అరణ్యాల గుండా ప్రయాణించి చూడండి. అలాగే చేకాగూడ వద్ద ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్‌కి వెళ్లి పరిశీలించండి. తర్వాత, ఒడిశాలోని నిర్మలమైన హిల్ స్టేషన్ డారింగ్‌బడికి వెళ్లడానికి ప్రయత్నించండి. అక్కడి కాఫీ తోటల్లో విహరించి చూడండి. మరోవైపు డారింగ్‌బడి జలపాతాలను అన్వేషించడం, బటర్‌ఫ్లై హిల్ వ్యూ పార్కులను సందర్శించడం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ ప్రయాణికులు ఆస్వాదించాలనుకంటే వాటర్‌స్పోర్ట్స్‌లోనూ పాల్గొనే అవకాశం ఉంది.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి