Breaking News

ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయన్నా-ఎన్ఐఏ

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దారుణ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఆ క్రమంలో ప్రాథమిక దర్యాప్తు పూర్తియింది. అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.


Published on: 02 May 2025 14:01  IST

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల టూరిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మరియు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నేరుగా సంబంధం ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఈ దాడి పూర్తి ప్రణాళిక పాకిస్థాన్‌లోనే రూపొందించబడిందని అధికారులు స్పష్టం చేశారు.ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరు – హష్మీ ముసా అలియాస్ సులేమాన్, అలీ బాయ్‌లు – పాకిస్థాన్ పౌరులేనని ఎన్ఐఏ తమ దర్యాప్తులో తేల్చింది. పాక్‌లో ఉన్న ప్రధాన మౌలికంగా ఈ దాడికి మార్గనిర్దేశం చేశారు. దాడి సమయంలో ఉగ్రవాదులు విదేశాల్లో ఉన్న హందర్లు, తామే చర్యలు తీసుకోమన్న వాళ్లతో నిరంతరం సంభాషణల్లో ఉన్నట్టు ఆధారాలు లభించాయి.

ఉగ్రవాదులు దాడికి ముందు వారం రోజులు భారత్‌లోకి ప్రవేశించి, స్థానికుల సహాయంతో నివాసం ఏర్పరచుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. ఆయుధాలు, రహదారి మార్గాలు, దాడి ప్రాంత సమాచారం — ఇవన్నీ స్థానిక మద్దతుదారుల సహకారంతోనే సాకారమైనట్టు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు దాడి జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్‌, 3డీ మ్యాపింగ్‌, మొబైల్ డేటా విశ్లేషణ, శాటిలైట్ ఫోన్‌ల ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని వినియోగించారు. దాడి స్థలంలో దాదాపు 40 బుల్లెట్ల అవశేషాలను స్వాధీనం చేసుకుని వాటిని ల్యాబ్‌కు పంపించారు. ఈ విచారణలో బైసరన్ ప్రాంతంలో మూడు శాటిలైట్ ఫోన్‌లు పనిచేశాయి అన్నదీ వెలుగులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఎన్ఐఏ దాదాపు 2,800 మందిని విచారించగా, 150 మందిని కస్టడీలోకి తీసుకుంది. కుప్వారా, పుల్వామా, బారాముల్లా, సోపూర్, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో ఇంటిలిజెన్స్ ఆధారంగా సోదాలు నిర్వహించారు. అంతేకాదు, సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పలు కీలక సమాచారం సేకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి