Breaking News

అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం తెలిపారు.అలాగే ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.


Published on: 02 May 2025 11:22  IST

అమరావతి, మే 2: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించనుండటంతో, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం తెలిపారు. ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతును ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజల కలల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర సహకారం అమూల్యమని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ఈ సభకు లక్షలాదిమంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్టే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల బస్సులు ఏర్పాటు చేశారు. అందులో 6,600 బస్సులు రాజధాని పరిసర 8 జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు, మిగిలిన 120 నియోజకవర్గాల కోసం 1,400 బస్సులు కేటాయించారు. ఒక్కో బస్సుకు ఒక బాధ్యత ఉన్న అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ప్రజలను సభా ప్రాంగణానికి తీసుకెళ్లి, తిరిగి వారి గ్రామాలకు చేర్చే బాధ్యత వారికి అప్పగించారు.

బస్సులు గురువారం మధ్యాహ్నానికి సభ ప్రదేశానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ, ఓఆర్ఎస్ పాకెట్లు, పండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో ఆరోగ్య కేంద్రాలు, సభా ప్రాంగణంలో వైద్య బృందాలను సిద్ధం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆహార సరఫరా బాధ్యతలు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి