Breaking News

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా ద్వారకాలోని ఒక ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి

శనివారం వరకు తీవ్రమైన వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Published on: 02 May 2025 11:51  IST

న్యూఢిల్లీ, మే 2: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈదురుగాలులు, వర్షాలు ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గురువారం తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ద్వారకా ప్రాంతంలో ఓ ఇంటిపై చెట్టు పడిన ఘటనలో మహిళతో పాటు ముగ్గురు పిల్లలు మృతిచెందారు.వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ప్రభావంతో రహదారులపైకి నీరు చేరడం, వాహనాల రాకపోకలలో అంతరాయం తలెత్తడం, విమానాల షెడ్యూల్‌ల్లో మార్పులు అనివార్యమయ్యాయి.

విమాన సర్వీసులపై విపరీతమైన ప్రభావం పడింది. దాదాపు 100 విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. ఇందులో బెంగళూరు-ఢిల్లీ, పుణె-ఢిల్లీ సర్వీసులు జైపూర్‌కు మళ్లించబడ్డాయి. అలాగే, కొన్ని విమానాలు 20 నిమిషాల ఆలస్యంగా దిగుతున్నాయి, న్యూఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు సగటున గంట ఆలస్యంగా పయనిస్తున్నాయి.

ఇక వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఢిల్లీలో ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది. గంటకు 70–80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా సాధారణ వర్షాలు నమోదవుతున్నాయి.వాతావరణ శాఖ శనివారం వరకు తీవ్రమైన వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి