Breaking News

కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్ర ఆరంభమైనట్లే

ఉత్తరాఖండ్ జిల్లాలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం పుష్కర్ సింగ్ దామి హాజరయ్యారు.


Published on: 02 May 2025 11:44  IST

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ దేవాలయం ద్వారాలు శుక్రవారం ఉదయం భక్తుల సందర్శన కోసం తెరిచారు. ఉదయం 7 గంటలకు వేద మంత్రాల గానంతో ఆలయం తలుపులు తెరిచారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.భక్తులు భారీగా తరలివచ్చారు. వారిని స్వాగతించేందుకు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, వేద పండితులు కూడా పాల్గొన్నారు.

చార్‌ధామ్ యాత్రలో భాగంగా గతంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 30న తెరిచిన విషయం తెలిసిందే. ఇక బద్రీనాథ్ ఆలయం మే 4న భక్తులకు అందుబాటులోకి రానుంది. కేదార్‌నాథ్‌కి భక్తుల రాక పెరగడంతో సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రతా చర్యల విషయానికొస్తే, దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు, ఇతర ముఖ్య ప్రదేశాల్లోనూ పోలీసు బలగాలను మోహరించారు.

కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్ర ఆరంభమైనట్లే. ఇక బద్రీనాథ్ ఆలయం కూడా తెరుచుకున్న తరువాత భక్తుల రాక మరింతగా పెరగనుంది. లక్షలాది భక్తులు యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి