Breaking News

మృతుల కుటుంబాలకు కేటీఆర్‌ భరోసా


Published on: 20 Nov 2025 17:37  IST

సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో (Saudi Bus Accident) మరణించిన వారి బంధువులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నెల 17న సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 42 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడిక్‌మెట్‌, రాంనగర్‌, విద్యానగర్‌లోని మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్‌ పరామర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి