Breaking News

ఆరు గ్రాముల చైన్.. ఆరున్నర గ్రాములు తూగింది..


Published on: 26 Nov 2025 16:06  IST

తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో చీరాలలో కొందరు బంగారు నగల వ్యాపారుల ఘరానా మోసం బట్టబయలైంది. బాపట్ల జిల్లా తూనికలు, కొలతల శాఖ శాఖ జాయింట్ కంట్రోలర్ మాధురీ, సహాయ కంట్రోలర్ లిల్లీ, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు చీరాలలోని ఓ నగల షాపునకు వచ్చారు. అక్కడ ఓ నగకు చెందిన ట్యాగులో ఉన్న తూకం విలువను గుర్తించారు. ఆ నగను వాస్తవంగా తూకం వేశారు. అయితే దీంతో వ్యత్యాసం కనిపించింది. నగల వ్యాపారికి రెండు లక్షల జరిమానా విధించారు.

Follow us on , &

ఇవీ చదవండి