Breaking News

జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల సెటైర్లు..


Published on: 29 Jan 2026 17:03  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు... అధికారం కోసమే కదా అని ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్... ఆ తర్వాత వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి